శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 02:17:36

మాజీ డాన్‌, బిజినెస్‌మ్యాన్‌ ముత్తప్పరాయ్‌ మృతి

మాజీ డాన్‌, బిజినెస్‌మ్యాన్‌ ముత్తప్పరాయ్‌ మృతి

బెంగళూరు: అండర్‌వరల్డ్‌ డాన్‌గా బెంగళూరును గడగడలాడించి.. ఆ తర్వాత వ్యాపారవేత్తగా, దాతగా పేరొందిన ముత్తప్ప రాయ్‌ (68) శుక్రవారం మృతిచెందారు. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కారణంగా ఏడాది కాలంగా బాధపడుతున్న ఆయన.. శుక్రవారం బెంగళూరులోని మణిపాల్‌ దవాఖానలో చికిత్స పొందుతూ  మరణించారు.


logo