శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:54

ఇండ్లకు రేకులతో సీల్‌!

ఇండ్లకు రేకులతో సీల్‌!

  • కరోనా పేరుతో బెంగళూరు మున్సిపల్‌ సిబ్బంది నిర్వాకం

బెంగళూరు: బెంగళూరు మున్సిపల్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న కారణంగా హోంక్వారంటైన్‌ పేరుతో రోగి ఫ్లాట్‌తో పాటు పక్కనే ఉన్న మరో ఫ్లాట్‌ను ఇనుప రేకులతో సీల్‌ చేశారు. మున్సిపల్‌ సిబ్బంది ఫ్లాట్‌ తలుపులకు రేకులు అమర్చడాన్ని ఎదురుగా ఉన్న మరో ఇంటి యజమాని ఫోటోలు తీసి గురువారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కారణమైన బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నిర్వాకంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీబీఎంపీ కమిషనర్‌ మంజునాథ ప్రసాద్‌ క్షమాపణ చెప్పారు. 

తాజావార్తలు


logo