బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 25, 2020 , 11:55:20

కర్ణాట‌క‌లో 10 కిలోల గంజాయి ప‌ట్టివేత‌

కర్ణాట‌క‌లో 10 కిలోల గంజాయి ప‌ట్టివేత‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరులో పెద్ద మొత్తంలో గంజాయి ప‌ట్టుబ‌డింది. అంత‌ర్రాష్ట్ర స్థాయిలో మ‌త్తుమందులు విక్ర‌యించ‌డంలో ఆరితేరిన‌ రామ‌బాబు అనే వ్య‌క్తి నుంచి బెంగ‌ళూరు పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రామ‌బాబును అదుపులోకి తీసుకుని ఈస్ట్ బెంగ‌ళూరు డివిజ‌న్‌లోని రామ‌మూర్తి న‌గర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. రామ‌బాబు నుంచి స్వాధీనం చేసుకున్న‌ గంజాయి విలువ సుమారుగా రూ.3 ల‌క్ష‌లకుపైనే ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. 

నిందితుడు రామ‌బాబు ఈస్ట్ బెంగ‌ళూరు డివిజ‌న్‌లో బంగారం విక్ర‌యిస్తున్న‌ట్లు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నామ‌ని, అత‌నిపై ఎన్‌డీపీఎస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 20బి కింద కేసు న‌మోదుచేశామ‌ని బెంగ‌ళూరు ఈస్ట్ డీసీపీ వెల్ల‌డించారు. మ‌త్తు ప‌దార్థాల విక్ర‌యానికి సంబంధించి ప‌లు రాష్ట్రాల్లో నిందితుడిపై ఇప్ప‌టికే చాలా కేసులు న‌మోదై ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo