శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 12:37:42

వహ్‌వా.. బెంగళూరు పోలీస్‌!

వహ్‌వా.. బెంగళూరు పోలీస్‌!

పోలీసులు ఏది చేసినా వార్తే అవుతుంది. అంతేకాదు వైరల్‌ కూడా అవుతుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న కుక్కలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్‌ ఇప్పుడు వారికి మంచి పేరు తీసుకొస్తున్నది. ఇదెక్కడో కాదు.. బెంగళూరు సిటీలో .

దేశీ కుక్కలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఇటీవల బెంగళూరు సిటీ పోలీసులు వాటిని దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆన్‌లైన్లో మాత్రం వారి చర్యలకు మంచి పేరు వస్తోంది. నెటిజన్లు బెంగళూరు పోలీసులను తెగ పొగుడుతున్నారు. ఇదిప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరిపోయింది. దత్తత తీసుకున్న శునకాలకు మంచి ట్రెయినింగ్‌ ఇస్తున్నందుకు.. వాటిని ఫ్రెండ్లీ పెట్స్‌గా మారుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. వహ్‌వా పోలీస్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. logo