మంగళవారం 31 మార్చి 2020
National - Feb 14, 2020 , 00:52:01

స్థానికులకు రిజర్వేషన్ల కోసం కర్ణాటక బంద్‌

స్థానికులకు  రిజర్వేషన్ల కోసం కర్ణాటక బంద్‌
  • ఏపీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

బెంగళూరు: స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించిన సరోజిని మహిషి నివేదిక అమలు కోసం కన్నడ సంఘాలు గురువారం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న ఓ బస్సుపై దక్షిణ కన్నడ జిల్లాలోని ఫిరంగిపేట వద్ద ఆందోళనకారులు రాళ్లురువ్వారు. దీంతో బస్సు ధ్వంసమైంది. బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉన్నా బస్సులు, ఆటోలు యథావిధిగా నడిచాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులోనూ బంద్‌ ప్రభావం అంతగా లేదు. కర్ణాటక-తమిళనాడు రాష్ర్టాల సరిహద్దులోని అనేకల్‌ ప్రాంతంలో నిరసనకారులు బలవంతంగా దుకాణాలను మూయించారు. బంద్‌ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలపై సీఎం యెడియూరప్ప స్పందిస్తూ సరోజిని మహిషి నివేదిక అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఉద్యోగాల్లో, కర్ణాటకలోని ప్రైవేట్‌ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలని (రిజర్వేషన్లు కల్పించాలని) గతంలో సరోజిని మహిషి నివేదిక సూచించింది.

logo
>>>>>>