మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 21:54:38

గాల్లో ఎగురుకుంటూ వచ్చి మహిళపై పడ్డాడు.. వీడియో వైరల్‌

గాల్లో ఎగురుకుంటూ వచ్చి మహిళపై పడ్డాడు.. వీడియో వైరల్‌

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్‌ గాల్లో ఎగురుకుంటూ వచ్చి మహిళపై పడ్డాడు. దీంతో ఆ మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 

సునీత అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో కొంతదూరంలో ఉన్న ఆటోడ్రైవర్‌ తన ఆటో ఆగిపోతే తోస్తున్నాడు. అక్కడే ఒక తీగతెగిపడి ఉంది. ఈ తీగ మరో వాహనానికి చిక్కుకుని పైకి లేవగా, తీగతోపాటు ఆటో డ్రైవర్‌ గాల్లో తీగ వెంట కొద్దిదూరం వెళ్లి సునీతపై పడ్డాడు. క్షణాల్లోనే ఇది జరిగిపోయింది. సునీతకు మెడకు తీవ్రగాయాలయ్యాయి. రక్తస్రావం కాగా, ఆ పక్కనే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త కృష్ణమూర్తి ఆమెను దవాఖానలో చేర్పించాడు. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎవరో తన పేరు పిలిస్తే వెనక్కి తిరిగి చూశానని, అంతలోపే ఆటోడ్రైవర్‌ హనుమంతుడిలాగా గాల్లో తేలుకుంటూ వచ్చిన తనపై పడ్డాడని సునీత పేర్కొంది. దీంతో తాను అక్కడే కుప్పకూలిపోయానని పేర్కొంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo