బెంగాల్ నటి మోనామీ ఘోష్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె డ్యాన్స్‌కు జనాలు ఫిదా అవుతారు. కాగా, మోనామీ ఘోష్..స్పైస్ జెట్ విమాన సిబ్బందితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వీడియోను మోనామీ ఘోష్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్చేసింది. ఈ వీడియోలో స్పైస్ జెట్ విమాన సిబ్బంది యూనిఫాంలో..మోనామీ ఘోష్ నీలిరంగు డ్రెస్సులో తళుక్కుమన్నారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. తొలిసారి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లాష్‌మాబ్ నిర్వహించినట్లు మోనామీ తెలిపారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఇప్పటివరకూ 4.7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.