శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 00:42:12

బీజేపీకి బెంగాలీ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌బై

బీజేపీకి బెంగాలీ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌బై
  • కపిల్‌ మిశ్రా ఉన్న పార్టీ లో నేనుండను

కోల్‌కతా: ప్రముఖ బెంగాల్‌ నటి సుభద్రా ముఖర్జీ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఢిల్లీ అల్లర్లలో 40 మందికిపైగా మరణించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అనురాగ్‌ ఠాకూర్‌, కపిల్‌ మిశ్రా ఉండే పార్టీలో తాను ఉండలేనన్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌కు శనివారం రాజీనామా లేఖను పంపినట్లు సుభద్రా ముఖర్జీ చెప్పారు. 2013లో తాను బీజేపీలో చేరానని, అయితే ప్రస్తుతం పార్టీ తీరు పట్ల కలత చెందినట్లు ఆమె పేర్కొన్నారు. పార్టీ నేతలు ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను మతపరంగా విభజిస్తున్నారని ఆరోపించారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన అనురాగ్‌ ఠాకూర్‌, కపిల్‌ మిశ్రాలపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుభద్రా ముఖర్జీ ప్రశ్నించారు. 
logo