గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 13:32:33

నాడు బంగారం, వ‌జ్రాల మాస్క్‌.. నేడు 'సిగ్న‌ల్ మాస్క్' ట్రెండ్ గురూ!

నాడు బంగారం, వ‌జ్రాల మాస్క్‌.. నేడు 'సిగ్న‌ల్ మాస్క్' ట్రెండ్ గురూ!

అంద‌రూ మాస్క్ అంటే క్లాత్ మాస్క్‌, మెడిక‌ల్ మాస్క్ వాడుతుంటే.. ముంబైకు చెందిన ధ‌నికుడు ల‌క్ష‌లు విలువ‌జేసే బంగారు మాస్క్ చేపించుకున్నాడు. ఇదే అనుకుంటే దీనిని మించిన మాస్క్‌ను వజ్రాల‌తో త‌యారు చేసి చూపించాడు సూర‌త్‌కు చెందిన జ్యువెల్ల‌రీ షాపు య‌జ‌మాని. ఈ మాస్కుల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడితే గాని ద‌గ‌ద‌గ‌మ‌న‌లేదు. ఇప్పుడు ట్రెండ్‌లోకి వ‌చ్చిన సిగ్న‌ల్ మాస్క్ అంద‌రినీ అల‌ర్ట్ చేస్తుంది. 

క‌రోనా వైర‌స్ నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి బెంగాల్‌కు చెందిన గౌర్ నాథ్ స‌రికొత్త ఫేస్‌మాస్క్ త‌యారు చేపించాడు. మాస్క్‌కు అంచుల చుట్టూ ఎల్ఈడీ బ‌ల్బుల వ‌రుస జోడించాడు. ఇది పెట్టుకున్న‌ప్పుడు ట్రాఫిక్ సిగ్న‌ల్‌లానే అనిపిస్తుంది. బ్లూ, రెడ్‌, ఆరెంజ్ లైట్ల‌‌తో ద‌గ‌ద‌గ మెరిసిపోతుంది. ఇది అత‌నికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతోపాటు ఇత‌రుల‌కు క‌రోనా ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పింస్తుందంటున్నాడు గౌర్ నాథ్‌. అంతేకాదు. ఇది ఇత‌రుల‌ను అల‌ర్ట్ చేయ‌డానికి ఎంతో సాయ‌ప‌డుతుంది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌గా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. మ‌రి ట్రాఫిక్ లైట్లు ముఖం మీద ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. 



logo