గురువారం 26 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 21:27:49

20లక్షల మంది విద్యార్థులకు ‘దీదీ’ సైకిళ్లు

20లక్షల మంది విద్యార్థులకు ‘దీదీ’ సైకిళ్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 20 లక్షల మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులకు 10 లక్షల సైకిళ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని సీఎం మమతా బెనర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. 2015-2016లో ప్రారంభించిన ‘సాబుజ్ సతీ’ పథకం కింద సీఎం మమత 84 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడానికి సైకిళ్లు అందించారు. ఈ పథకం ఐక్యరాజ్యసమితి క్రింద ప్రతిష్టాత్మక ప్రపంచ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ (WSIS) అవార్డును పొందింది.

‘పాఠశాలల పున ప్రారంభం పునః ప్రారంభ తేదీ ఇంకా నిర్ణయించలేదు. విద్యార్థుల జాబితా తయారు చేసి సైకిళ్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. అర్హత కలిగి ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా చూడాలని చెప్పారని’ ఓ రాష్ట్ర ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. కార్యక్రమానిక వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ పర్యవేక్షిస్తుందని, అధికారులు ఇప్పటికే 10లక్షల సైకిళ్లు సేకరించేందుకు టెండర్‌ పిలిచారని చెప్పారు. సీఎం ఆదేశాలతో మరో పది లక్షల సైకిళ్లకు మరో టెండర్‌ను పిలువనున్నట్లు ఆయన వివరించారు. ఈ చర్యతో ప్రభుత్వానికి ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మరో అధికారి పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.