శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 19:56:18

జులై 31 వ‌ర‌కు బెంగాల్ లో లాక్ డౌన్ పొడిగింపు

జులై 31 వ‌ర‌కు బెంగాల్ లో లాక్ డౌన్ పొడిగింపు

కోల్ క‌తా : క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా నియంత్ర‌ణ కోసం ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. జులై 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు బెంగాల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న‌ లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియ‌నుంది. కేసుల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో.. మ‌రో నెల రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు తెర‌వ‌బ‌డ‌వు అని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రైళ్లు, మెట్రో స‌ర్వీసులు కూడా న‌డ‌వ‌వు అని చెప్పింది. బెంగాల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 14,728 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 580 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,218 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 


logo