మంగళవారం 07 జూలై 2020
National - Mar 26, 2020 , 19:24:51

సామాజిక దూరం ఇలా పాటించండి: బెంగాల్ సీఎం

సామాజిక దూరం ఇలా పాటించండి: బెంగాల్ సీఎం

కోల్‌క‌తా: కొవిడ్-19 వైర‌స్ విస్త‌ర‌ణ కారణంగా అన్ని రాష్ట్రాల్లో లాగే ప‌శ్చిమ‌బెంగాల్ లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కోల్‌క‌తా వీధుల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అధికారుల‌తో క‌లిసి కోల్‌క‌తాలోని ఒక కూరగాయ‌ల మార్కెట్ కు చేరుకున్నారు. అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ వీధి వ్యాపారుల‌కు, అధికారులకు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సామాజిక దూరం ఎలా పాటించాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు. మ‌నిషికి మ‌నిషికి క‌నీసం రెండు మీట‌ర్లు దూరం పాటించాల‌ని చెప్పారు. అంతేకాదు సామాజిక దూరానికి సంబంధించి స్వ‌యంగా ఇటుక రాయితో స‌ర్కిల్ లు గీసి వివ‌రించారు మ‌మ‌త‌. ఇప్పుడు ఆ దృశ్యాల‌తో కూడిన వీడియో ఒక‌టి ట్విట్ట‌ర్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.   


logo