గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 16:12:03

8 రైళ్లు వ‌స్తున్నాయ‌న్న బెంగాల్‌.. అలాంటిదేమీ లేద‌న్న రైల్వేశాఖ‌

8 రైళ్లు వ‌స్తున్నాయ‌న్న బెంగాల్‌.. అలాంటిదేమీ లేద‌న్న రైల్వేశాఖ‌

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల త‌ర‌లింపులో బెంగాల్ ప్ర‌భుత్వం కేంద్రానికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తున్న‌ది.  వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తీసుకు వ‌చ్చేందుకు బెంగాల్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా .. ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి లేఖ రాశారు. ఆ లేఖ అందిన త‌ర్వాత తృణ‌మూల్ పార్టీ స్పందించింది. త‌మ రాష్ట్రానికి 8 శ్రామిక్ రైళ్లు వ‌స్తున్న‌ట్లు ఆ పార్టీ పేర్కొన్న‌ది. కానీ బెంగాల్ ప్ర‌భుత్వం చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌ను .. రైల్వే శాఖ కొట్టిపారేసింది. శ్రామిక్ రైళ్ల గురించి బెంగాల్ త‌మ‌తో ఎటువంటి ఒప్పందం చేసుకోలేద‌ని రైల్వేశాఖ వెల్ల‌డించింది. కానీ హైద‌రాబాద్ నుంచి మాల్దాకు శ‌నివారం ఓ రైలు ప్రారంభంకానున్న‌ట్లు టీఎంసీ పేర్కొన్న‌ది. క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైళ్లు వ‌స్తున్న‌ట్లు బెంగాల్ ప్ర‌భుత్వం పేర్కొన్నా.. అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేని రైల్వే శాఖ వెల్ల‌డించింది. దీంతో బెంగాల్ వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది.logo