శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 17:43:18

బీజేపీ ఎంపీకి క‌రోనా పాజిటివ్

బీజేపీ ఎంపీకి క‌రోనా పాజిటివ్

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఎంపీ ఛ‌ట‌ర్జీ ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. గ‌త వారం రోజుల నుంచి త‌న‌కు స్వ‌ల్ప జ్వ‌రం ఉండ‌టంతో సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని చెప్పారు. 

జూన్ 19న నిర్వ‌హించిన ఆర్మీ జ‌వాను రాజేష్ ఓరాంగ్ అంత్య‌క్రియ‌ల్లో ఎంపీ ఛ‌ట‌ర్జీతో పాటు ఎంపీ సుమిత్రా ఖాన్ పాల్గొన్నారు. ఈ అంత్య‌క్రియ‌లకు వంద‌లాది మంది హాజ‌ర‌య్యారు. 


logo