మంగళవారం 19 జనవరి 2021
National - Dec 24, 2020 , 16:08:53

బెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు : కాంగ్రెస్‌ నేత రంజన్‌ చౌదరి

బెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు : కాంగ్రెస్‌ నేత రంజన్‌ చౌదరి

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ గురువారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘ఈ రోజు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షలతో ఎన్నికల కూటమిని అధికారికంగా ఆమోదించింది’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిలనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా అన్ని లౌకిక పార్టీలతో ఎన్నికల అవగాహన కలిగిఉండాలని పశ్చిమ బెంగాల్‌ యూనిట్‌ నిర్ణయాన్ని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) అక్టోబర్‌లో ఆమోదించింది.  2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పశ్చిమ బెంగాల్‌ యూనిట్‌ నిర్ణయాన్ని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ తిరస్కరించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 చోట్ల విజయం సాధించగా.. లెఫ్ట్‌ఫ్రంట్‌ కేవలం 32 స్థానాలతో సరిపెట్టుకుంది.