శుక్రవారం 03 జూలై 2020
National - May 28, 2020 , 11:22:51

చిత్రపటంతో కరోనా బాధితులకు సాయం!

చిత్రపటంతో కరోనా బాధితులకు సాయం!

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామానికి చెందిన కళాకారుణి వేసిన చిత్రపటం వీడియోను మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

ఈమె పేరు పట్వాస్‌. కాన్వాస్‌ షీట్లపై పౌరాణిక కథలు, సామాజిక సమస్యలు, జానపద కథలను చిత్రాలుగా చిత్రీకరిస్తుంది. ఈ చిత్రపటాలను అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్నిగడగడలాడిస్తున్నకరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ చిత్రాలు చిత్రీకరిస్తున్నది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును కరోనా బాధితులకు విరాళంగా ఇచ్చింది. తాను వేసే ప్రతి ఆర్ట్‌ను చూపించేటప్పుడు బొమ్మల వెనుక దాగున్న కథని పాటల రూపంలో పాడి వినిపిస్తుంది. చాలా తక్కువ మొత్తంలో ఉపాధి పొందుతున్నప్పటికీ కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన పాట్వాస్‌కు అభినందనలు తెలుపుతూ పటాచిత్రం వీడియోను షేర్‌ చేసింది స్మృతి ఇరానీ. ఇప్పుడు ఈ వీడియోను వేలమంది వీక్షించారు.


logo