ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 15:01:17

పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

హైదరాబాద్ : పిస్తా పప్పులో పోషకాలు అధికమోతాదులో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పిస్తా పప్పును చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొలోన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించేందుకు ఉపకారిస్తుంది. కేలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ లో పిస్తాపప్పును కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తుంది.అంతేకాదు బ్లడ్ ప్రెజర్ కూడా అదుపులో ఉంటుంది. కాన్సర్ కారక వైరస్‌లను నియంత్రించడంలో పిస్తాలో ఉండే పోషకాలు మంచి పనితీరు కనబరుస్తాయట. 

షుగర్ వ్యాధితో బాధపడేవారికి పిస్తా ఉపయోగపడుతుంది. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. నట్స్ తింటే లావైపోతామేమోనని కొంతమంది నట్స్ ను పూర్తిగా మానేస్తారు. కానీ అది కేవలం అపోహేనని అంటున్నారు పోషకాహార నిపుణులు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo