శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 21:56:16

ఆవ నూనె ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

 ఆవ నూనె ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

హైదరాబాద్ : ఆవ నూనే అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతుంది.   ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు అంతా సన్ ఫ్లవర్ ఆయిలే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల కోసం సర్చింగ్ మొదలుపెట్టారు. అయితే రోగ నిరోధక శక్తి కోసం ఏది పడితే అది తీసుకోవడం మంచిది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

-ఆవ నూనె రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

-ఆవ నూనెలో ఉండే ఒమేగా 3, ఒమేగా 5 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ "ఇ " శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

-ఆవ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ళు నొప్పి తగ్గుతాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల కొవ్వులను ఆవ నూనె అందిస్తుంది.

-ఎర్ర రక్త కణాలను మెరుగుపరుస్తుంది. ఆవ నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవ నూనెలో గుండెను కాపాడే ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.

-ఆవ నూనె యాంటీ బాక్టీరియ, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణవ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది.

-ఆవ నూనెలో శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వుల సమతుల్యతను కాపాడేందుకు అవసరమైన మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఆవ నూనెతో ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి లవంగాలతో వేడిచేసిన ఆవ నూనె కాళ్ళు, ఛాతీ అరికాళ్ళపై రుద్దినప్పుడు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.