మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 22:52:37

మ‌నోద‌ర్ప‌ణ్ కార్య‌క్ర‌మ ప్రయోజనాలు ?

మ‌నోద‌ర్ప‌ణ్ కార్య‌క్ర‌మ ప్రయోజనాలు ?

ఢిల్లీ: విద్యార్థులు, టీచ‌ర్లు, పాఠ‌శాల టీచ‌ర్లు, యూనివ‌ర్సిటీ సిబ్బంది, విద్యార్థుల కుటుంబాల‌కు త‌గిన సూచ‌న‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు ఎం.హెచ్‌.ఆర్‌.డి . వెబ్‌సైట్‌లో వెబ్  పేజీ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇది మాన‌సిక సమస్యలకు సంబంధించిన సూచ‌న‌లు, స‌ల‌హాలు, చిట్కాలు, పోస్ట‌ర్లు, వీడియోలు, చేయ‌ద‌గిన‌, చేయ‌కూడ‌ని అంశాల పై త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు, ఆన్‌లైన్ ప్ర‌శ్న‌ల వ్య‌వ‌స్థ ఉంటుంది .

--పాఠ‌శాల‌, విశ్వ‌విద్యాల‌య స్థాయిలో కౌన్సిల‌ర్ల‌కు సంబంధించిన డైర‌క్ట‌రీ, జాతీయ స్థాయి డేటా బేస్ ఏర్పాటు. జాతీయ స్థాయి హెల్ప్‌లైన్ లో టెలి కౌన్సిలింగ్ సేవ‌లు స్వ‌చ్ఛందంగా అందుబాటులో వారి వివ‌రాలు ..

--దేశ‌వ్యాప్తంగా గ‌ల‌ పాఠ‌శాల‌లు, కాలేజీలు, విశ్వ‌విద్యాల‌యాల విద్యార్ధులు ఎం.హెచ్‌.ఆర్‌.డి ఏర్పాటు  చేసిన జాతీయ టోల్‌ఫ్రీ  హెల్ప్‌లైన్ ద్వారా సేవ‌లు పొందే ఏర్పాటు. ఈ హెల్ప్ లైన్ ను సైకాలజిస్టులు, నిపుణులైన కౌన్సిల‌ర్లు , మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించిన వారు నిర్వ‌హిస్తారు. కోవిడ్ -19 ప‌రిస్థితుల అనంత‌రం కూడా ఇది కొన‌సాగుతుంది.

--మాన‌సిక‌సామాజిక‌మ‌ద్ద‌తు:  విద్యార్థుల జీవ‌న నైపుణ్యాలు  మెరుగుప‌ర‌చ‌డం, శ్రేయ‌స్సు అనేదానిపై ఒక హ్యాండ్ బుక్‌ను ఆన్‌లైన్ లో ఉంచుతారు. ఈ పుస్త‌కంలో త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు, వాస్త‌వాలు, అపోహ‌లు, భావోద్రేక‌ప‌ర‌మైన అంశాల‌ను ఎలా ఎదుర్కోవ‌డం, ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌నుఎదుర్కోవ‌డం వంటి వాటికి సంబంధించి కొవిడ్ స‌మ‌యంలోనూ ఆ త‌ర్వాత‌కు ప‌నికి వ‌చ్చే అంశాలు ( పాఠ‌శాల విద్యార్థుల‌స్థాయి నుంచి కాలేజీ యువ‌త వ‌ర‌కు ) ఉంటాయి.

--విద్యార్ధులు, టీచ‌ర్లు, కుటుంబ స‌భ్యులు కోవిడ్ -19 స‌మ‌యంలో, ఆ త‌ర్వాత కౌన్సిలింగ్‌, మార్గ‌నిర్దేశం పొంద‌డానికి  సంప్ర‌దించేందుకు ఇంట‌‌రాక్టివ్ ఆన్ లైన్ చాట్ ప్లాట్ ఫాం ను  ఏర్పాట చేశారు. మాన‌సిక ఆరోగ్య నిపుణులు, సైకాల‌జిస్టులు వీరికి మార్గ‌నిర్దేశం చేయ‌డానికి సిద్ధంగా ఉంటారు.--ఈ వెబ్ పేజీలో వెబినార్లు, ఆడియో విజువ‌ల్ స‌మాచారం, వీడియోలు, పోస్ట‌ర్లు, ఫ్ల‌య‌ర్లు, కామిక్‌లు, ల‌ఘు చిత్రాలతోపాటు అద‌న‌పు స‌మాచారం అందిస్తారు. దేశ‌వ్యాప్తంగా విద్యార్థుల నుంచి క్లౌడ్ సోర్సింగ్ ను పీర్ స‌పోర్టుగా ప్రోత్స‌హిస్తారు.


logo