గురువారం 01 అక్టోబర్ 2020
National - Jun 07, 2020 , 20:00:24

మండు వేస‌విలో మహా ఉప‌శ‌మనం బార్లీ జావ!

మండు వేస‌విలో మహా ఉప‌శ‌మనం బార్లీ జావ!

హైద‌రాబాద్‌: ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి పూట నిప్పుల వ‌ర్షం కురుస్తుండ‌టంతో జ‌నం ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాలంటే హ‌డ‌లిపోతున్నారు. ఇలాంటి మండు వేస‌విలో మ‌నం ఎంత నీడ ప‌ట్టున ఉన్నా నీర‌సం, నిస్స‌త్తువ ఆవహిస్తుంటాయి. స‌న్ హీట్ కార‌ణంగా బాగా డీ హైడ్రేష‌న్ జ‌రుగ‌డ‌మే ఇందుకు కార‌ణం. అయితే, ఇలా నీర‌సం, నిస్స‌త్తువ ఆవ‌హించిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే శ‌క్తి కావాల‌నిపిస్తుంది. అలాంటి స‌మ‌యంలో బార్లీ జావ చ‌క్క‌టి ప‌రిష్కారం చూపుతుంది. 

బార్లీ గింజ‌ల ప్ర‌త్యేకత ఏమిటి?

బార్లీ గింజ‌ల్లో విట‌మిన్  B1 పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఈ విటమిన్‌కు త‌క్ష‌ణ శ‌క్తిని అందించే ల‌క్ష‌ణం ఉంటుంది. అందుకే బార్లీ గింజ‌ల‌తో చేసిన జావ తాగితే నీర‌సం, అల‌స‌ట వెంట‌నే మ‌టుమాయం అవుతాయి. విట‌మిన్  B1, పొటాషియం లోపం ఉన్న‌వాళ్ల‌లో సాధార‌ణంగా ముఖం, కాళ్ల‌లో వాపులు క‌నిపిస్తాయి. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు త‌ర‌చూ బార్లీ జావ తీసుకుంటే త‌ప్ప‌కుండా ప‌రిష్కారం ల‌భిస్తుంది. 

బార్లీ జావ త‌యారీ

బార్లీ జావ‌ను చాలా సుల‌భంగా త‌యారుచేసుకోవ‌చ్చు. జొన్న‌, రాగి జావ లాగానే బార్లీ జావ‌ను కూడా బార్లీ గింజ‌ల పొడితో త‌యారు చేస్తారు. అయితే, ఈ బార్లీ జావ‌కు కొద్దిగి చ‌ల్ల‌, నిమ్మ‌ర‌సం కూడా క‌లిపి తీసుకుంటే రుచితోపాటు శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. 

ప్ర‌‌యోజ‌నాలు

1. బార్లీ జావ ఒంట్లో వేడిని త‌గ్గిస్తుంది. నీర‌సం, నిస్స‌త్తువ‌ల నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం క‌లుగజేస్తుంది. 

2. హృద‌య, కిడ్నీ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్లు కూడా బార్లీ జావ‌ను నిస్సంకోచంగా తీసుకోవ‌చ్చు.

3. అధిక ర‌క్త‌పోటు, త‌ల‌నొప్పి, డ‌యేరియా, మూత్ర‌నాళంలో వాపు, అరిచేతులు, అరికాళ్ల మంట‌లు ఉన్న‌వాళ్లు త‌ర‌చూ బార్లీ జావ తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. 

4. కొన్ని చ‌ర్మ రోగాల‌కు కూడా బార్లీ జావ మంచి ప‌రిష్కారం చూపుతుంది. 

5. బార్లీగా గింజ‌ల‌ను దోర‌గా వేయించి, దంచుకుని జావ చేసుకుంటే మంచి రుచితోపాటు, సువాస‌న కూడా వ‌స్తుంది.logo