బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 21:16:33

అరటి ఆకు భోజనంతో ఎన్ని బెనిఫిట్సో.... తెలుసా?

అరటి ఆకు భోజనంతో ఎన్ని బెనిఫిట్సో.... తెలుసా?

హైదరాబాద్: భారతదేశంలో అనేక ఆహార నియమాలున్నాయి. వాటిలో అరటి ఆకులో భోజనం చేయడం ప్రధానమైంది. ఆహారం తీసుకోవడమే కాదు, ఎలా, ఎందులో తినాలో కూడా మన పూర్వీకులు నిర్ణయించారు. మన సంప్రదాయం ప్రకారం అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట. అరటి ఆకులో భోజనం అనేది మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఎన్ని రకాల ఆకులుండగా అరటి ఆకును మాత్రమే ఎంచుకోడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. వేడి వేడి పదార్ధాలను అరటి ఆకుమీద వడ్డించడం వలన ఆకుమీద వుండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో భోజనం చేస్తే ఈ సహజ కార్బన్ సమ్మేళనాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను నిలువరించడంలో సాయపడుతాయి. అరటి ఆకులో తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడంవల్ల కఫ వాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది.

అరటి ఆకులలో భోజనం చేయడంవల్ల పేగుల్లోని క్రిములు నాశనమమవుతాయని ఆయుర్వేదం చెబుతున్నది. అరటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది. వాడి పారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి నేలను సారవంతం చేస్తాయి. కాబట్టి పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను అరికట్టడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. logo