గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 16:07:02

నేను ప‌ట్టింద‌ల్లా బంగార‌మే: శిఖ‌ర్‌ధావ‌న్

నేను ప‌ట్టింద‌ల్లా బంగార‌మే: శిఖ‌ర్‌ధావ‌న్

దుబాయ్‌: భార‌త క్రికెట్ జ‌ట్టులో డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ అయిన శిఖ‌ర్‌ధావ‌న్ ఈ ఐపీఎల్ సీజ‌న్‌ను చాలా నెమ్మ‌దిగా మొద‌లుపెట్టాడు. కానీ మెల్ల‌మెల్ల‌గా స్పీడు పెంచి ఇప్పుడు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్న ధావ‌న్ తొలి రెండు మ్యాచ్‌ల‌లో 20ల స్కోరుకే ఔట‌య్యాడు. కానీ ఇప్పుడు రెండు వ‌రుస సెంచ‌రీలు కొట్టి 465 ప‌రుగుల‌తో ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ నేప‌థ్యంలో ధావ‌న్ మాట్లాడుతూ.. తన ఆట గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని చెప్పాడు. 

'నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండ‌ట‌మే ఇష్టం. ఒత్త‌డిలో ఉండ‌టం న‌చ్చ‌దు. ముందుగా ఇత‌రులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యాన్ని నేను ప‌ట్టించుకోను. రెండోది నేను ఆట‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తాను. అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నేను ఆట కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతానో నాకు తెలుసు. అంతేకాదు, ఓ విష‌యంలో నా మీద నాకు చాలా న‌మ్మ‌కం ఉన్న‌ది. అదేమిటంటే నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది' అని ధావ‌న్ పేర్కొన్నాడు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.