ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 07:10:48

లెబనాన్‌కు భారత్‌ సాయం అందజేత

లెబనాన్‌కు భారత్‌ సాయం అందజేత

న్యూఢిల్లీ: లెబనాన్‌కు భారత్‌ శుక్రవారం 58 మెట్రిక్‌ టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రిని అందజేసింది. ఇందులో ముఖ్యమైన ఔషధాలు, ఆహార పదార్థాలు ఉన్నాయి. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో జరిగిన పేలుడుతో భారీ విధ్వంసం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.logo