బుధవారం 27 జనవరి 2021
National - Dec 26, 2020 , 03:03:19

సఫారీ.. సవారీ

సఫారీ.. సవారీ

  • మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ప్రారంభం 

ఉమరియా: దేశంలోనే తొలిసారిగా ‘టైగర్‌ రిజర్వ్‌ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ వైల్డ్‌లైఫ్‌ సఫారీ’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవగఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. బఫర్‌ జోన్‌కు మాత్రమే ఈ సేవలు పరిమితమని, పర్యాటకులు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో కూర్చొని పులులు, సింహాలు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను కొంత ఎత్తు నుంచి వీక్షించొచ్చని మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ మంత్రి విజయ్‌ షా తెలిపారు. ‘ఆఫ్రికా అడవుల్లో మాదిరిగానే ఇప్పుడు భారత్‌లోనూ హాట్‌ఎయిర్‌ బెలూన్‌ వైల్డ్‌లైఫ్‌ సఫారీని ఆస్వాదించొచ్చు. రాష్ట్రంలోని మిగతా టైగర్‌ రిజర్వుల్లోనూ త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తెస్తాం’ అని ఆయన వివరించారు.


logo