మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 11:13:52

యాచకులకు బిచ్చమేయకండి.. కరోనా వ్యాప్తికి అవకాశం

యాచకులకు బిచ్చమేయకండి.. కరోనా వ్యాప్తికి అవకాశం

ఛండీఘర్‌ : కరోనా అందరినీ కలవర పెడుతోంది. సామాజిక వ్యాప్తి చెందుతున్న కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మహమ్మారి ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియక జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన కూడళ్లు, రోడ్లపై కనిపించే యాచకులకు బిచ్చమేయొద్దని ఛండీఘర్‌ ప్రజలకు ప్రభుత్వ సలహాదారు మనోజ్‌ పరిడా సూచించారు. యాచకులు రోజుకు వందల మందిని అడుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రజలందరూ ఈ వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

యాచకలను షెల్టర్‌ హోమ్స్‌లో ఉంచితే.. పైసల కోసం మళ్లీ బయటకు పరుగెడుతున్నారు. యాచించడం తప్పు కాదు.. కాబట్టి వారిని జైల్లో ఉంచలేమని మనోజ్‌ పేర్కొన్నారు. యాచకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. 

ఛండీఘర్‌లో ఇప్పటి వరకు 852 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి 555 మంది కోలుకున్నారు. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo