శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 08:33:23

రండి చాయ్ తాగుదాం.. బీజేపీ ఎమ్మెల్యేకు ప్రియాంక ఆహ్వానం

రండి చాయ్ తాగుదాం.. బీజేపీ ఎమ్మెల్యేకు ప్రియాంక ఆహ్వానం

న్యూఢిల్లీ: తానుంటున్న ప్ర‌భుత్వ బంగ్లాను ఖాళీ చేయ‌డానికి ముందు, ఆ ఇంట్లోకి రానున్న బీజేపీ ఎమ్మెల్యేను చాయ్ తాగేందుకు రావాల‌ని ప్రియాంకా గాంధీ ఆహ్వానించారు. ఈమేర‌కు ఎమ్మెల్యేకు ఫోన్ చేయ‌డంతోపాటు, ఆయ‌న కార్యాల‌యానికి లేఖ కూడా పంపించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. 

కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి ప్రియాంకా గాంధీ ఢిల్లీలోని 35 లోధీ స్టేట్ బంగ‌ళాలో నివాసం ఉంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఆమెకు ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఉపసంహ‌రించుకుంది. దీంతో ఆ బంగ‌ళాను ఆగ‌స్టు 1లోపు ఖాళీ చేయాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఈ నెల 1న‌ నోటీసులు జారీచేసింది. ఆ ఇంట్లోకి బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బ‌లూనీ రానున్నారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబాన్ని చాయ్ తాగ‌డానికి ప్రియాంకా గాంధీ ఆహ్వానించారు. అయితే ప్రియాంక ఆహ్వానానికి ఎమ్మెల్యే ఇంకా స్పందించ‌లేదు. 

ప్రియాంకా గాంధీ త‌న కుటుంబంతో 1997 నుంచి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. 


logo