శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 11:24:26

బావిలో రెండు ఎలుగుబంట్లు.. కాపాడిన అటవీ సిబ్బంది

బావిలో రెండు ఎలుగుబంట్లు.. కాపాడిన అటవీ సిబ్బంది

ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిన రెండు ఎలుగుబంట్లను అటవీ సిబ్బంది కాపాడారు. సలేకాసా ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జాంబడీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుమారు నాలుగు గంటలు తంటాలు పడి వాటిని ఎలాగోలా బయటపడేలా చేసి అడవిలో వదిలిపెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టారు. 'కరోనా కల్లోలపు నిరాశామయ వాతావరణంలో ఇది ఉత్సాహపరిచే ఘటన' అనే క్యాప్షన్‌తో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వీడియోను షేర్ చేశారు. సుమారు 19 వేలమంది ఈ వీడియోను వీక్షించారు.


logo