శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 11:34:23

పిల్ల‌ల‌కు 'నిఘా' క‌ళ‌ను నేర్పుతున్న ఎలుగుబంటి : వీడియో వైర‌ల్‌

పిల్ల‌ల‌కు 'నిఘా' క‌ళ‌ను నేర్పుతున్న ఎలుగుబంటి :  వీడియో వైర‌ల్‌

పిల్ల‌ల‌కు మంచి, చెడుల‌ను చెప్పేందుకు త‌ల్లే ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. త‌ల్లి చేసే ప్ర‌తి ప‌నిని పిల్ల‌లు అనుస‌రిస్తూ ఉంటారు. త‌మ‌ పిల్ల‌లు ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా త‌మ‌ని తాము ర‌క్షించుకునే విధంగా శిక్ష‌ణ ఇస్తారు. అది మ‌నుషులైనా, జంతువులైనా. ఒక త‌ల్లి ఎలుగుబంటి త‌న పిల్ల‌ల‌కు 'నిఘా' క‌ళ‌ను నేర్పిస్తున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

10 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో త‌ల్లి ఎలుగుబంటి త‌న పిల్ల‌ల‌తో పాటు అడ‌విలోని ఒక ప్రాంతం గుండా ప్ర‌యాణిస్తున్న‌ది. అప్పుడే చుట్టుప‌క్క‌ల దృశ్యాల‌ను గ‌మ‌నించే క‌ళ‌ను త‌న పిల్ల‌ల‌కు నేర్పింది. 'తల్లి పిల్లలకు నిఘా కళను నేర్పుతుంది'‌ అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌కు భ‌లే న‌చ్చేసింది. అందుకే నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

 

తాజావార్తలు


logo