సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 16:28:01

స్పందించేందుకు సిద్ధంగా ఉండండి.. ఐఏఎఫ్ కమాండర్లతో రాజ్‌నాథ్ సింగ్

 స్పందించేందుకు సిద్ధంగా ఉండండి.. ఐఏఎఫ్ కమాండర్లతో రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: వెంటనే స్పందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని భారత వాయుసేన కమాండర్స్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలమైన వాయుభవన్‌లో ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్‌తో పలు అంశాలపై మాట్లాడారు. లఢక్ సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ పోషించిన కీలక పాత్రను రాజ్‌నాథ్ అభినందించారు. భారత్, చైనా మధ్య సరిహద్దులో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో చిన్న ఆదేశాలతోనైనా వేగంగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్‌కు సూచించారు. గత ఏడాది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన తీరును ప్రశంసించారు. "తదుపరి దశాబ్దంలో భారత వైమానిక దళం" అనే థీమ్‌తో మూడు రోజులపాటు జరుగనున్న ఎయిర్‌ఫోర్స్ కమాండర్ల సదస్సుకు భారత వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా అధ్యక్షత వహించారు. తొలి రోజు సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు రక్షణ శాఖ, రక్షణ ఉత్పత్తి కార్యదర్శులు పాల్గొన్నారు.
logo