సోమవారం 25 మే 2020
National - Apr 08, 2020 , 06:35:08

‘నీకు కరోనా సోకాలి’

‘నీకు కరోనా సోకాలి’

కోల్‌కతా: న్యాయమూర్తికి కరోనా సోకాలంటూ ఒక లాయర్‌ శాపనార్థాలు పెట్టాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకున్నది. లోన్‌ను చెల్లించనందుకు తన కక్షిదారుకు చెందిన బస్సును బ్యాంకు అధికారులు సీజ్‌ చేశారని, దీనిపై అత్యవసరంగా విచారణ జరుపాలని కోరుతూ న్యాయవాది బిజోయ్‌ అధికారై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, కరోనా నేపథ్యంలో దీనిపై అత్యవసర విచారణకు న్యాయమూర్తి జస్టిస్‌ దీపంకర్‌ నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన బిజోయ్‌ జడ్జిని ఉద్దేశిస్తూ ‘నీకు కరోనా సోకునుగాక’ అంటూ శాపనార్థాలకు దిగాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి బిజోయ్‌పై కోర్టుధిక్కార చర్యలకు ఆదేశించారు.


logo