బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:24:18

బెంగళూరులో 19 ప్రైవేటు దవాఖానలపై వేటు

బెంగళూరులో 19 ప్రైవేటు దవాఖానలపై వేటు

  • లైసెన్సులు రద్దు.. కరోనా నిబంధనల ఉల్లంఘనే కారణం 

బెంగళూరు: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను పాటించని 19 ప్రైవేటు దవాఖానల లైసెన్సులను బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు రద్దు చేశారు. కరోనా రోగులకు ప్రైవేటు దవాఖానల్లో తప్పనిసరిగా 50 శాతం పడకలను కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించని 19 ప్రైవేటు దవాఖానల అనుమతులను రద్దు చేసినట్టు బెంగళూరు సౌత్‌ జోన్‌ ఆరోగ్య అధికారి డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. ‘విపత్తు నిర్వహణ చట్టం, 2005’ ప్రకారం సదరు దవాఖానలపై కేసులు నమోదు చేశామన్నారు.


logo