సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 20:46:23

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు: న‌్యాయ‌వాదికి బార్ కౌన్సిల్ నోటీస్‌

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు: న‌్యాయ‌వాదికి బార్ కౌన్సిల్ నోటీస్‌

తిరువ‌నంత‌పురం: కేర‌ళ గోల్డ్ స్మిగ్లింగ్ కేసులో నిందితుడి త‌ర‌ఫున వాదిస్తున్న న్యాయవాది కేసరి కృష్ణన్ నాయర్‌కు ఆ రాష్ట్ర‌ బార్ కౌన్సిల్ నోటీస్‌ ఇచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడైన సరిత్ పీఎస్ తరపున వాదనలు వినిపిస్తున్న కేసరి కృష్ణన్ ఇటీవ‌ల ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినందున ఆయ‌న‌కు నోటీస్ జారీచేసిన‌ట్లు బార్ కౌన్సిల్ తెలిపింది. త‌మ నోటీస్‌ను స్వీకరించిన తేదీ నుంచి రెండు వారాల్లోగా జవాబు ఇవ్వాలని కేసరి కృష్ణన్‌ను బార్ కౌన్సిల్ ఆదేశించింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడ‌దో తెలియజేయాలని కోరింది.

టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా న్యాయవాది ప్రవర్తన తనను నమ్మిన క్లయింటు ప్రయోజనాలకు విఘాతం కలిగించిందని బార్ కౌన్సిల్ నోటీస్‌ల‌లో పేర్కొన్న‌ది. న్యాయవాది ప్రవర్తన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్‌లోని పార్ట్-6, చాప్టర్-2 కింద వృత్తిపరమైన ప్రవర్తన, ఆచార వ్యవహారాల ప్రమాణాల నియమాలను ఉల్లంఘిస్తున్న‌ద‌ని తెలిపారు. స‌ద‌రు న్యాయ‌వాది న్యాయవాద వృత్తిని దిగజార్చారని, వృత్తిపరమైన ప్రవర్తన, ఆచార వ్యవహారాల ప్రమాణాలలోని రూల్-36ను తీవ్రంగా ఉల్లంఘించారని ఆ నోటీస్‌ల‌లో పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo