ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:59:52

తగ్గనున్న బ్యాంకుల వడ్డీ రేట్లు ?

తగ్గనున్న బ్యాంకుల వడ్డీ రేట్లు ?

హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుంటు పడింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నది. గతేడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు వరుసగా వడ్డీ రేట్లు తగ్గి స్తున్నది .ఆగస్ట్ 4 నుంచి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి భేటీ కానున్నది. కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈసారి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్యల్లో భాగంగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే సూచనలు ఉన్నాయి. ఆగస్ట్ 4వ తేదీ నుం చి 6వ తేదీ మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ భేటీలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఎంపీసీ సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం), రివర్స్ రెపో రేటు 35 బేసిస్ (0.35 శాతం) పాయింట్లు తగ్గించే అవకాశముందని అంచనా. కరోనా కారణంగా గత కొద్ది రోజుల్లో వడ్డీ రేట్లు 115 బేసిస్ పాయింట్లు తగ్గాయి. మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచే మిగులు నిధులపై కేంద్ర బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు. కరోనా, లాక్ డౌన్ వల్ల నీరసించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వడ్డీరేట్లు తగ్గించడం తప్ప ఆర్బీఐకి మరో మార్గం లేదని భావిస్తున్నారు.logo