శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:54:08

బ్యాంకు ఎంప్లాయీస్ కు శుభవార్త

 బ్యాంకు ఎంప్లాయీస్ కు శుభవార్త

ఢిల్లీ: ఓ పక్క కరోనా కష్టాలు మరో పక్క లాక్ డౌన్ నష్టాలతో పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా బ్యాంకు ఎంప్లాయీస్ కు శుభవార్త అందింది.  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(  ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో 15 శాతం జీతాల పెంపుతో పాటు, నాలుగు శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు నవంబర్ 2017 నుంచే అమలులోకి రానుంది. దీని ప్రకారం, గతంలో బేసిక్ శాలరీలో 10 శాతం పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుండగా, ఇకపై 14 శాతం బేసిక్ వేతనం, డీఏలు పెన్షన్ మొత్తానికి జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగుల వేతనాల బిల్లు సంవత్సరానికి రూ. 7,900 కోట్ల మేరకు పెరుగుతుంది. ఇక, 5 శాతానికి మించిన నిర్వహణా లాభాలను సాధించిన బ్యాంకుల ఉద్యోగులకు అదనంగా ఇన్సెంటివ్ లు కూడా అందనున్నాయి.


logo