ఢాకా: ఫేస్బుక్లో వెక్కిరింత ఎమోజీ ‘హహ్హా’ను వాడటంపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రఖ్యాత మతగురువు అహ్మదుల్లా ఫత్వా జారీ చేశారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లో ఆయనకు 30 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. శనివారం ఆయన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ‘ఎవరినైనా ఎగతాళి చేయడానికి, వెక్కిరించడానికి ఫేస్బుక్లో ‘హహ్హా’ ఎమోజీని వాడుతున్నారు. ఇది ఫన్ కోసం అయితే పర్వాలేదు. కానీ ఎగతాళి చేయడమే మీ ఉద్దేశం అయితే అది ఇస్లాంలో నిషిద్ధం’ అని అన్నారు.