సోమవారం 06 జూలై 2020
National - Jun 30, 2020 , 01:08:19

నదిలో రెండు పడవలు ఢీ 32 మంది దుర్మరణం.. బంగ్లాదేశ్‌లో దారుణం

నదిలో రెండు పడవలు ఢీ 32 మంది దుర్మరణం.. బంగ్లాదేశ్‌లో దారుణం

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగా నదిలో రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 32 మంది దుర్మరణం చెందారు. పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని కొంత మందిని రక్షించాయి. కొంతమంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. మార్నింగ్‌ బర్డ్‌ అనే పడవ 100 మందికి పైగా ప్రయాణికులతో మున్షి గంజ్‌ నుంచి ఢాకాకు వస్తున్నది. సదర్‌ఘాట్‌ వద్ద మోయుర్‌ అనే లాంచీ పడవను ఢీకొట్టింది. దీంతో మార్నింగ్‌ బర్డ్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. చాలా మంది ప్రయాణికులు ఈ పడవ కింద చిక్కుకుని జలసమాధి అయినట్టు భావిస్తున్నారు. 


logo