బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:13:55

బెంగళూరులో కుప్పకూలిన భవనం

బెంగళూరులో కుప్పకూలిన భవనం

బెంగళూరు : బెంగళూరు నగరంలో కపిల్ థియేటర్‌కు వెళ్లే దారిలో ఉన్న మూడంతస్తుల మేజెస్టిక్ హోటల్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. ఈ భవనం పక్కనే కన్‌స్ట్రక్షన్ జరుగుతుండడంతో భారీ గొయ్యి తీశారు. దీంతోనే హోటల్ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.

కపిల్ థియేటర్‌ను కూల్చి మల్టిఫ్లెక్స్ కడుతుండగా దీని కోసం దాదాపు 80 అడుగుల లోతులో భారీ గొయ్యిని తవ్వారు. అయితే దాని పక్కనే ఉన్న బిల్డింగ్‌పై ప్రభావం పడింది. దీంతో పగుళ్లు వచ్చి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.  అప్రమత్తమైన అధికారులు పక్క భవనంలో ఉన్నవారిని కూడా ఖాళీ చేయించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo