మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 07:15:17

జమ్ములో లష్కరే తాయిబా ఉగ్రవాది అరెస్ట్‌

జమ్ములో లష్కరే తాయిబా ఉగ్రవాది అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో నిత్యం ఏదోఒక చోట టెర్రరిస్టులను అరెస్టు చేయడం, ఎన్‌కౌంటర్‌ చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా లష్కరే తాయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతన్ని రఫిఖ్‌ అహ్మద్‌ అలియాస్‌ హాజీగా గుర్తించారు. కశ్మీర్‌లోని బండిపొర ప్రాంతం హాజిన్‌ పట్టణంలోని హాజబరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు, 13 రాజస్థాన్‌ రైఫిల్స్‌కు చెందిన దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. 

వారిపై ఉగ్రవాది ఉగ్రవాది రఫిక్‌ గ్రెనెడ్‌ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో జవాన్లు అతన్ని అరెస్టు చేశారు. అతన్నుంచి లైవ్‌ గ్రెనెడ్లు, మందుగుండు సామగ్రి, ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. చాంద్రగిర్‌కు చెందిన అతడు ఈమధ్యే లష్కరే చేరాడని పోలీసులు తెలిపారు.   


logo