మంగళవారం 31 మార్చి 2020
National - Mar 27, 2020 , 01:31:10

చెన్నైలో జొమాటో, స్విగ్గీలపై నిషేధం

చెన్నైలో జొమాటో, స్విగ్గీలపై నిషేధం

చెన్నై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సేవల సంస్థలు జొమాటో, స్విగ్గీపై నిషేధం విధించినట్లు చెన్నై కార్పొరేషన్‌ ప్రకటించింది. వండిన ఆహారాన్ని స్వచ్ఛందసంస్థలు ప్రజలకు పంపిణీ చేయటంపైనా నిషేధం విధించింది. అయితే నిత్యావసర సరుకులు, కూరగాయల వంటివి హోండెలివరీ చేసే ఈ-కామర్స్‌ కంపెనీలకు అనుమతిచ్చినట్టు తెలిపింది. సరుకులు అందించే ఉద్యోగులు మాస్కు లు, గ్లౌజులు, సానిటైజర్స్‌ తదితర నిబంధనలను తప్పనిసరి పాటించాలని, వినియోగదారులను నేరుగా తాకవద్దని పేర్కొంది.


logo
>>>>>>