శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 06:57:54

పొగాకు ఉత్పత్తులపై నిషేధం!

పొగాకు ఉత్పత్తులపై నిషేధం!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఢిల్లీతోపాటు 25 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుట్కా, పాన్‌ మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించాయని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కరోనాను నియంత్రించడానికి గత నెల ఒకటో తేదీనే అన్ని రాష్ర్టాలను పాన్‌ మసాలా, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని అన్ని రాష్ర్టాలను ఆరోగ్యశాఖ కోరింది. ప్రస్తుతం 22 రాష్ర్టాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు వీటిని నిషేధించాయని అధికార వర్గాల కథనం. కరోనా వ్యాపించకుండా నివారించేందుకు పొగాకు ఉత్పత్తుల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి. అసోం, జార్ఖండ్‌, హర్యానా, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాల ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులను ఉమ్మివేసిన వారిపై జరిమానా కూడా విధించాయి.


logo