శుక్రవారం 10 జూలై 2020
National - Jul 01, 2020 , 15:37:48

టిక్‌టాక్‌పై నిషేధం తొంద‌ర‌పాటు చ‌ర్య‌: నుస్ర‌త్ జ‌హాన్

టిక్‌టాక్‌పై నిషేధం తొంద‌ర‌పాటు చ‌ర్య‌: నుస్ర‌త్ జ‌హాన్

కోల్‌క‌తా: ‌చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంప‌ట్ల దేశ‌వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అయితే, ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్ మాత్రం కేంద్రం నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. టిక్‌టాక్ యాప్‌పై నిషేధం ఒక తొంద‌ర‌పాటు చ‌ర్య అని ఆమె విమ‌ర్శించారు. ఈ మ‌ధ్యాహ్నం కోల్‌క‌తాలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన శ్రీకృష్ణ ర‌థ‌యాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నుస్ర‌త్ జ‌హాన్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా టిక్‌టాక్ నిషేధం నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. 

'టిక్‌టాక్ అనేది వినోదాన్ని పంచే ఒక అప్లికేష‌న్‌. ఆ యాప్‌పై నిషేధం విధించడంలో కేంద్రం తొంద‌ర‌ప‌డింది. ఈ నిషేధంవ‌ల్ల దేశంలో జ‌రిగే న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న వ్యూహాత్మ ప్ర‌ణాళిక ఏమిటి? టిక్‌టాక్‌పై నిషేధం వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారి ప‌రిస్థితి ఏమిటి? ఒక‌ప్పుడు నోట్ల ర‌ద్దువ‌ల్ల ఇబ్బందులు ప‌డిన‌ట్లే, ఇప్పుడు టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే తాను లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెబుతారు' అని నుస్ర‌త్ ప్ర‌శ్నించారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo