శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 11:02:33

ఆగ‌స్టు 15 వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానా‌లు బంద్‌

ఆగ‌స్టు 15 వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానా‌లు బంద్‌

హైద‌రాబాద్‌: కోల్‌క‌తాకు ఆరు న‌గ‌రాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల విమానాల‌పై ఆంక్ష‌లను పొడిగించారు.  కోవిడ్19 హాట్‌స్పాట్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, నాగ‌పూర్‌, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల నుంచి కోల్‌క‌తా వ‌చ్చే విమానాల‌పై ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు బ్యాన్ విధించారు. కోల్‌క‌తాలోని నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ అంత‌ర్జాతీయ విమానాశ్రంయ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  బెంగాల్‌లో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు వారానికి రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ పాటించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.logo