శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 18:42:16

క‌రోనా ఎఫెక్ట్: యూపీలో పాన్ మ‌సాలాపై నిషేధం

క‌రోనా ఎఫెక్ట్: యూపీలో పాన్ మ‌సాలాపై నిషేధం

ల‌క్నో:  క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణను అరిక‌ట్టేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాన్ మ‌సాలాపై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పాన్ మ‌సాలాలు త‌యారు చేసే కంపెనీల‌తోపాటు, వాటిని అమ్మే దుకాణాలను  కూడా మూసివేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. 

పాన్ మ‌సాలాల‌పై నిషేధం నిర‌వ‌ధికంగా ఉంటుంద‌ని, తాము త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేవ‌ర‌కు నిషేధం కొన‌సాగుతుంద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆహార‌భ‌ద్ర‌తా శాఖ ఆర్డ‌ర్స్ జారీ చేసింది. పాన్ మ‌సాలాను త‌యారు చేసినా, అమ్మినా, నిలువ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. రోడ్ల‌పై ఎక్క‌డప‌డితే అక్క‌డ ఉమ్మివేయ‌డంవ‌ల్ల క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తిచెందుతుంద‌న్న ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. కాగా, యూపీలో 2003, ఏప్రిల్ 1 నుంచి గుట్కాల‌పై నిషేధం కొన‌సాగుతున్న‌ది.   


logo