శనివారం 30 మే 2020
National - Mar 30, 2020 , 05:32:51

శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

హైదరాబాద్ :  యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నిర్మూలనలో శానిటైజర్లకున్న ప్రాధాన్యం దృష్ట్యా భారత్‌ నుంచి విదేశాలకు వాటి ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రకాల వెంటిలేటర్ల ఎగుమతిపైనా నిషేధాజ్ఞలు తెచ్చింది. ఇప్పటికే సర్జికల్‌, డిస్పోజబుల్‌ మాస్క్‌లు, వీటి తయారీకి ఉపయోగించే ఉత్పత్తుల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్కెట్‌లో హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్క్‌లకు విపరీతంగా డిమాండ్‌ కనిపిస్తున్నది.


logo