ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 12:55:19

‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’!

‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’!

న్యూ ఢిల్లీ : భారత్‌, చైనా మధ్య గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి వస్తువులను కొనుగోలు చేయొద్దని, విక్రయించొద్దని ఆందోళన చేపడుతున్నారు. ఢిల్లీలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఐఐటీ) ఆధ్వర్యంలో సోమవారం చైనా వస్తువులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు పింగ్‌ చిత్రపటంతో పాటు చైనాలో తయారైన బొమ్మలు, ప్లాస్టిక్‌ వస్తువులకు మంట పెట్టి బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని,  ప్రతి ఒక్కరూ దేశానికి మద్దతుగా, అండగా నిలువాలని కోరారు.logo