శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 13:11:11

బాలాకోట్ దాడులు.. స‌రిహ‌ద్దు చ‌రిత్ర‌ను మార్చేశాయి

బాలాకోట్ దాడులు.. స‌రిహ‌ద్దు చ‌రిత్ర‌ను మార్చేశాయి

 హైద‌రాబాద్‌:  బాలాకోట్ దాడుల‌తో ఉగ్ర‌వాదుల‌కు గ‌ట్టి సందేశాన్ని ఇచ్చామ‌ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ‌ ఢిల్లీలోని సెంట‌ర్ ఫ‌ర్ ఎయిర్ ప‌వ‌ర్ స్ట‌డీస్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉన్న మౌళిక‌స‌దుపాయాల‌ను ఉగ్ర‌వాదులు వాడుకోరాదు అన్న హెచ్చ‌రిక‌ను ఆ దాడుల‌తో చేశామ‌న్నారు. మ‌న‌కు ఇచ్చిన ల‌క్ష్యాల‌ను మ‌నం చేరుకోవాలంటే.. నిరంతరం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. బాలాకోట్ దాడులు.. స‌రిహ‌ద్దు చ‌రిత్ర‌ను మార్చేశాయ‌న్నారు. ఉగ్ర‌వాద నిర్మూల‌న‌కు మ‌న దేశం ఎంత క‌ట్టుబ‌డి ఉందో ఆ దాడులు చెబుతాయ‌ని రాజ్‌నాథ్ అన్నారు. ప్ర‌తి ఒక సైనికుడు అప్ర‌మ‌త్తంగా ఉంటే ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు ఉండ‌వ‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. స‌మ‌ర్థ‌వంత‌మైన‌ సైనిక, రాజ‌కీయ‌ నాయ‌క‌త్వం ద్వారానే ఉగ్ర‌వాదుల నివార‌ణ సాధ్యమ‌వుతుంద‌ని రావ‌త్ అన్నారు. కార్గిల్‌, ఉరి, పుల్వామా దాడుల త‌ర్వాత ఇటువంటి సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించామ‌న్నారు.   logo