శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 19:14:14

అమ్మాయితో కనిపించాడని దాడి..

అమ్మాయితో కనిపించాడని దాడి..

ముజఫర్‌నగర్‌:  లవ్‌ జిహాద్‌ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేసిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తను యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. షాదాబ్‌ అనే వ్యక్తి మరో కులానికి చెందిన అమ్మాయితో కలిసి తిరుగుతూ కనిపించడంతో..నిందితుడు పంకజ్‌ రాఠి (భజరంగ్‌ దళ్‌ కార్యకర్త) షాదాబ్‌పై దాడికి దిగిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఎస్పీ వినీత్‌ జైశ్వాల్‌ ఆదేశాల మేరకు వీడియో ఆధారంగా పంకజ్‌ రాఠిని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించినట్లు పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. 


logo