మంగళవారం 07 జూలై 2020
National - Jun 24, 2020 , 14:45:14

ట్రక్కు వెళ్తుండగా కుప్పకూలిన బ్రిడ్జి..వీడియో

ట్రక్కు వెళ్తుండగా కుప్పకూలిన బ్రిడ్జి..వీడియో

ఉత్తరాఖండ్‌: డెహ్రాడూన్‌ జిల్లాలో 40 అడుగుల పొడవైన స్టీల్‌ బ్రిడ్జి. ఓ ట్రక్కు భారీ యంత్రాన్ని బ్రిడ్జిపై నుంచి తీసుకెళ్తుండగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఇండియా-చైనా బార్డర్‌కు 50కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జి ఉంది. భారీ యంత్రం, ట్రక్కు బరువు సామర్థ్యానికి మించి ఉండటంతో బ్రిడ్జి ఒక్కసారి కూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్‌, మిషన్‌ ఆపరేటర్‌ గాయాలతో బయటపడ్డారు.

2009లో ఈ తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశాం. బ్రిడ్జిపై నుంచి గరిష్టంగా 18 టన్నుల బరువున్న వావానాలు వెళ్లొచ్చు. అయితే ట్రక్కు, దానిపై తీసుకెళ్తున్న యంత్రం బరువు కలిపి 26 టన్నులుంది. దీంతో బరువెక్కువై బ్రిడ్జి కుప్పకూలిందని మున్స్యారీ ఎస్‌డీఎం ఏకే శుక్లా తెలిపారు. డ్రైవర్‌, ఆపరేటర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. 
logo