బాధితురాలు, నిందితుడు ‘దేశ భావి సంపద’: హైకోర్టు
గువాహటీ: సహ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి బెయిలు మంజూరు చేస్తూ గౌహతి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధిత విద్యార్థిని, నిందిత విద్యార్థి ఇద్దరూ గువాహటి ఐఐటీ విద్యార్థులు కావడం గమనార్హం. ‘వారు దేశ భావి సంపద’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలను బట్టి నిందితునికి వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు తేలిన మాట వాస్తవమేనని, చార్జిషీటు దాఖలైతే ఇక నిందితుని నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది.