శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:24:11

ఆన్‌లైన్‌లో బద్రీనాథుడి ప్రసాదం!

ఆన్‌లైన్‌లో బద్రీనాథుడి ప్రసాదం!

బద్రీనాథ్‌: బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రం ప్రసాదం ఆన్‌లైన్‌లో లభించనున్నది. ఆన్‌లైన్‌లో ప్రసాదాన్ని సరఫరా చేసేందుకు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా అధికార యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకున్నది.  ఛమోలీ జిల్లా కలెక్టర్‌ స్వాతి భాదురియా మాట్లాడుతూ ‘కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. 18 ఎస్‌హెచ్‌జీలకు చెందిన 90 మంది మహిళలు ప్రసాదం తయారీలో పాల్గొంటున్నారని తెలిపారు.


logo